నేడు, రేపు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురు, శుక్రవారాల్లో ఉమ్మడిి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం, 10.30 గంటలకు గెన్నెపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. 11 గంటలకు దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.30కు అశ్వారావుపేట మండలం కేశప్పగూడెంలో, ఆ తర్వాత ములకలపల్లి మండలం కొత్తూరులో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 3 గంటలకు సత్తుపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని, 3.45 గంటలకు పెనుబల్లిలో సీసీ రోడ్డునిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పెనుబల్లి, కల్లూరు మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. 4.30 గంటలకు కల్లూరు మండలం పాయపూర్‌లో, 5 గంటలకు తల్లాడ మండలం అంబేద్కర్ నగర్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌లో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభిస్తారు. 10 గంటలకు పాల్వంచ మండలం ప్రభాత్‌నగర్ వద్ద యానంబైల్–జిన్నగట్ట మధ్య హైలెలెవ్ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారు. 11 గంటలకు పాల్వంచ మండలం పాండురంగాపురంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో 6వ బెటాలియన్ ప్రవేశద్వారం నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఒంటిగంటకు కొత్తగూడెం గణేష్ టెంపుల్ సమీపంలో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 3.30 గంటలకు ఖమ్మంరూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వద్ద బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 4 గంటలకు తనగంపాడులో, 4.30 గంటలకు కస్నాతండాలో, 5 గంటలకు కాచిరాజుగూడెంలలో, 5.30 గంటలకు ఆరెకోడుతండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment