శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన చెరుకు జయదీప్ – ప్రీతి దంపతులు బుధవారం రూ.1,00,116 విరాళం అందించారు. ఆలయ ఈఓ కె. జగన్మోహన్‌రావుకు నగదు అందజేయగా జయదీప్ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి శ్రీవారు, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ పీడీగా శ్రీనివాసరావు
ఖమ్మం గాంధీచౌక్: జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజె క్టు డైరెక్టర్‌గా బి.శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సూర్యాపేట జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావును తొలుత ఖమ్మం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ నోడల్ అధికారిగా నియమించిన ప్రభుత్వం.. తాజాగా పీడీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహనిర్మాణాలకు చర్యలు చేపట్టిన క్రమంలో 34 మంది అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ పీడీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్ ఉత్తర్వులు విడుదల చేశారు.
రామాలయంలో
సుదర్శన హోమం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment