28, 29 తేదీల్లో భక్త సమ్మేళనం
సత్తుపల్లిటౌన్: శ్రీ రామకృష్ణ పరమహంస – స్వామి వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో సత్తుపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి భక్త సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనానికి హైదరాబాద్ శ్రీరామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద స్వామి మహారాజ్, ఇతర రాష్ట్రాల స్వామీజీలు, మాతాజీలు హాజరు కానున్నారు. 28వ తేదీన జరిగే సమ్మేళనానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
28న విద్యార్థి సమ్మేళనం..
విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ భావజలాన్ని నింపేందుకు ఈ నెల 28న ఉదయం పాఠశాల స్థాయి, మధ్యాహ్నం కళాశాలల స్థాయి విద్యార్థులతో సమ్మేళనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.29న జరిగే సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీరామకృష్ణస్వామి, స్వామి వివేకానంద సేవా సంస్థల నిర్వాహకులు, భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు చీకటి శ్రీనివాసరావు, గట్టే వాసు, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు నాయుడు వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, పులి శ్రీనివాసరావు కోరారు.
తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment