ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో సభ ఏర్పాటుచేసినట్లు పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 26వ తేదీన ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ఎర్ర దండు కవాతు, ఆతర్వాత భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆవిర్భావ సభ ఉంటుందని చెప్పారు. తొలుత ఇందిరానగర్‌లోని పైలాన్ వద్ద అరుణ పతాకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ ఆవిష్కరిస్తారని తెలిపారు. కాగా, స్వాతంత్ర సంగ్రామంలోనే కాక ఆతర్వాత అనేక పోరాటాల్లో సీపీఐ కీలక భూమిక పోషించిందని, హక్కుల సాధన, త్యాగాలు తమ పార్టీ సొంతమని తెలిపారు. కమ్యూనిస్టుల చేసిన పోరాటాలతోనే భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధిహామీపథకం, సమాచార హక్కుచట్టం, ఎనిమిది గంటల పనివిధానం అమల్లోకి వచ్చాయ ని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.
సీపీఐ నాయకుడు హేమంతరావు
Comments
Please login to add a commentAdd a comment