అంజన్న సన్నిధిలో రామయ్యకు రాపత్తు సేవ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం రామయ్యకు రాపత్తు సేవ జరిగింది. బ్రిడ్జి సెం టర్‌లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో చైర్మన్ సుదర్శన్ ఆధ్వర్యంలో వైభవంగా సేవ నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ వేడుకగా స్వామి వారిని దేవస్థానం నుంచి తీసుకొచ్చి ఆశీనులు చేశారు.
స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన..
దేవస్థానంలో మూలమూర్తులకు ఆదివారాన్ని పురస్కరించుకుని అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపా రు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం..
దేవస్థానం సన్నిఽధిలో నిత్యాన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మారెళ్ల వెంకట అనిల్‌కుమార్, నమిత రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, దాత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా అభిషేకం, సువర్ణ పుష్పార్చన
పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment