ప్రయాణికులకు ఇబ్బందులు కలగొద్దు
చుంచుపల్లి: ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ సూచించారు. గురువారం ఆయన కొత్తగూడెం బస్టాండ్‌లో పండుగ ప్రయాణికుల తిరుగు ప్రయాణ రద్దీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. హైదరాబాద్‌కు అదనపు ట్రిప్పులు నడిచేలా చూడాలన్నారు. శుక్ర, శనివారాల్లో రద్దీ మరింతగా ఉండే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment