రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన
ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్, రూరల్ మండలాల్లో మున్నేటికి ఇరువైపులా రూ.690కోట్ల వ్యయంతో చేపడుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఇటీవల మొదలయ్యాయి. రెండు వైపులా కాలనీలను ముంపు బారి నుంచి రక్షించేందుకు రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తుండగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తరచుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యాన పనులను గురువారం క్వాలిటీ కంట్రోల్ విభాగం అదికారులు పరిశీలించారు. ఈఈ తేజావత్ వెంకటరమణ, డీఈ చంద్రశేఖర్ తదితరులను క్షేత్రస్థాయిలో నాణ్యతతో పాటు లెవల్స్‌పై ఆరా తీశారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment