సర్వే శరవేగంగా సాగాలి..
● పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ● పలు ప్రాంతాల్లో పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ
నేలకొండపల్లి: రాష్ట్రప్రభుత్వం ఈనెల 26నుంచి నాలుగు సంక్షేమ పథకాలను అమలుచేయనుండగా లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వే వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ సూచించారు. నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం, కొత్తకొత్తూరు, బోదులబండలో సర్వేను గురువారం ఆమె పరిశీలించారు. పలువురి ఇళ్లకు వెళ్లి వివరాల సేకరణ, నమోదు, అర్హత పత్రాలను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 19నాటికి సర్వే పూర్తిచేసి 20వ తేదీ నుంచి గ్రామసభల్లో ముసాయిదా జాబితాలు వెల్లడించాలని సూచించారు. ఆపై అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, సర్వే బృందాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పారదర్శకంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని కొత్తకొత్తూరు శివారులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల భూమిని అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి, డీఐఈఓ కె.రవిబాబు, తహసీల్దార్ జె.మాణిక్‌రావ్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ శివ, ఆర్‌ఐ ఆలస్యం మధుసూధన్‌రావు, ఏఈఓ అరవింద్, పంచాయతీ కార్యదర్శి బి.రవి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన లబ్ధిదారులకే పథకాలు
చింతకాని: అర్హులైన పేదలకే ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పకడ్బందీగా సర్వే చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ సూచించారు. చింతకాని మండలంలోని పాతర్లపాడులో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డుల జారీకి చేపట్టిన సర్వేను గురువారం ఆమె పరిశీలించి ఉద్యోగుల నుంచి వివరాలు ఆరా తీశారు. తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment