సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి
● శస్త్రచికిత్సలు ఎక్కువగా నమోదయే్యు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు ● డీఎంహెచ్‌ఓ కళావతిబాయి
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు అవగాహన కల్పించి సాధారణ ప్రసవానికి ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. ఈక్రమంలోనే సాధారణ కాన్పులు తక్కువగా.. సిజేరియన్లు ఎక్కువగా నమోదవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం, గంగారం పీహెచ్‌సీ, యూనాని ఆస్పత్రులను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సాధారణ కాన్పులపై విస్తృంతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. మాతా, శిశుమరణాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని, పుట్టిన వెంటనే శిశువులకు ముర్రుపాలు పట్టించేలా ప్రచారం చేయాలని చెప్పారు. అంతేకాక వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని తెలిపారు. అలాగే, కంటిశుక్లాల ఆపరేషన్లు అవసరమైన వారిని ఖమ్మం జనరల్ ఆస్పత్రికి పంపించాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ఓను వైద్యులు, సిబ్బంది సత్కరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.సీతారాం, డీపీఓ దుర్గాభవాని, డెమో సాంబశివరెడ్డి, వైద్యులు ఆర్.అవినాష్, పి.స్పందన, కాశియ్య, సూపర్‌వైజర్ శారారాణి, ఉద్యోగులు పాల్గొన్నారు.
● ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
వేంసూరు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించడం ద్వారా వారిలో నమ్మకాన్ని పెంచాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. వేంసూరు పీహెచ్‌సీని తనిఖీ చేసి ఆమె రికార్డులు పరిశీలించి వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాం, డాక్టర్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.
● అందుబాటులో ఉండాలి
పెనుబల్లి: పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. మండలంలోని లంకాసాగర్ పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆమె ఫార్మసీ, వ్యాక్సిన్లు, ఓపీ రికార్డులు పరిశీలించి పలు అంశాలపై సమీక్షించారు. డీపీఓ దుర్గాభవానీ, డాక్టర్ కిరణ్‌కుమార్‌తో పాటు సాంబశివరెడ్డి, పూలమ్మ, సుగుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment