రైతులకు సకాలంలో ఎరువులు
చింతకాని: రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య సూచించారు. చింతకాని మండలం నాగులవంచ సొసైటీని గురువారం తనిఖీ చేసిన ఆయన యూరియా నిల్వలు, రికార్డులను పరిశీలించి వ్యవసాయ శాఖ, సొసైటీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. మొక్కజొన్న, వరి పంటలకు అవసరమైన యూరియా ముందుగానే సమకూర్చుకుని అవసరమైన రైతులకు అందజేయాలని తెలిపారు. మొక్కజొన్న పంటకు యూరియా అవసరం పెరుగుతున్నందున మండలంలో రెండు సొసైటీల ద్వారా సరఫరా చేయాలన్నారు. కాగా, నాగులవంచ సొసైటీలో 100 టన్నుల యూరియా నిల్వ ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఇక ఎవరైనా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని డీఏఓ హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సీఈఓ శ్రీనివాసరావు, ఏఓ మానస, గ్రామపంచాయతీ కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment