విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఉదయం, సాయంత్రంతర్వాత చలిగాలుల ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది.
● రెవెన్యూ సిబ్బంది తీరు మార్చుకోవాలి... ● తహసీల్, పీహెచ్‌సీలో తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
వేంసూరు: ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకంతో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలందించాలే తప్ప నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. వేంసూరు పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా తహసీల్‌లో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందిపై ఫిర్యాదులు వస్తున్నందున ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం పీహెచ్‌సీకి వెళ్లిన కలెక్టర్ అక్కడ ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణ, రోజు వారీ, ఫార్మసీలో మందుల నిల్వలపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సమయపాలనతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తహసీల్దార్ ఎం.ఏ.రాజు, వైద్యులు ఇందుప్రియ, శ్రీవిద్య, హసీనా పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట నిఘా
ఖమ్మంసహకారనగర్: ఈవీఎంల గోదాం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదాంలను గురువారం తనిఖీ చేసిన ఆయన అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల నిర్వహణ భద్రతా సిబ్బంది విధులపై సూచనలు చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సీహెచ్.స్వామి, డీటీ అన్సారీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment