‘రైతు భరోసా’ భూముల పరిశీలన
తిరుమలాయపాలెం: మండలంలోని ఎదుళ్లచెరువు, మహ్మదాపురం గ్రామాల్లో రైతు భరోసాకు ఆమోదయోగ్యం కాని భూముల సర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు భరోసాలో పంటల సాగుకు అనుకూలం కాని భూములను సక్రమంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సర్వే వివరాలను తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఏఓ సీతారాంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు అర్హుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ సరిత, ఏఈఓ నవనీత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్‌ఓ కళావతిబాయి
మధిర : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి అన్నారు. మండల పరిధిలోని దెందుకూరు పీహెచ్‌సీని ఆదివారం ఆమె సందర్శించారు. సిబ్బంది పనితీరు, హాజరు రిజిస్టర్లు, ఓపీ రిజిష్టర్, పీహెచ్‌సీలో సదుపాయాలు, డెలివరీ గది, శానిటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు పృథ్వీ రాజ్‌నాయక్, చెరుకూరి దివ్యశృతి, సీహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్‌వైజర్ లంకా కొండయ్య, హెల్త్ అసిస్టెంట్ గుర్రం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ మెంటరింగ్
సభ్యుడిగా ప్రభాకర్ రెడ్డి
తిరుమలాయపాలెం: నూతన విద్యావిధానం –2020 అమలులో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ మిషన్ ఆన్ మెంట రింగ్ సభ్యుడిగా తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత పెసర ప్రభాకర్‌రెడ్డిని కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు ఎన్‌సీటీఈ, ఎన్‌ఎంఎం కన్వీనర్ దినేశ్ చతుర్వేది నుంచి ఆయనకు మెయిల్ అందింది. ఈ మిషన్‌లో భాగంగా జీవశాస్త్ర బోధనా పద్ధతులు, బోధనలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెంటరింగ్ అనే ప్రక్రియలో తనను భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జీవశాస్త్రం బోధనా పద్ధతులు, డిజిటల్ పరిజ్ఞా నం, ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి, వారి వ్యక్తిగత నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. నేషనల్ మెంటరింగ్ సభ్యుడిగా ఎంపికై న ప్రభాకర్‌రెడ్డిని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజ యకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.
రేపు క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన అండర్–17 బాలికల క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ఈనెల 21న ప్రారంభించనున్నట్లు జిల్లా పాఠశాల క్రీడల సంఘం కార్యదర్శి కె.నర్సింహమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రికెట్ జట్ల పటిష్టానికి ఈ శిబిరం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. శిక్షకులుగా శ్రీనివాస్ వ్యవహరిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment