క్రీడలు ఐక్యతను చాటుతాయి
● సీపీ సునీల్‌దత్ ● జిల్లాస్థాయి పోలీస్ క్రీడాపోటీలు ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్ : క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని, ఆటల ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు ప్రతిష్ట పెరుగుతాయని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, శాంతి కపోతాలు ఎగురవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు ప్రతి ఒక్కరికీ అవసరమని, పోలీస్ శాఖలో మానసిక వికాసం ముఖ్యమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజిగా ఉండే పోలీసులకు ఇలాంటి పోటీలు నూతనోత్సాహాన్ని అందిస్తాయని చెప్పారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతీ ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఖమ్మం టౌన్, రూరల్, వైరా, కల్లూరు సబ్ డివిజన్ల పోలీస్ సిబ్బంది మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించే ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఆడ్మిన్) నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment