![40 రో](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05ckm31-600615_mr-1738780850-0.jpg.webp?itok=EIe-30F8)
40 రోజుల్లోనే వరి ఈనింది..
ఓంకార్ వరి విత్తనాల బ్యాగ్ రూ.వెయ్యికి కొనుగోలు చేశా. 85 – 90 రోజులకు బదులు 30 – 40 రోజుల్లోనే పొట్ట దశకు చేరింది. చలి వాతావరణమైతే అన్ని కంపెనీలవి ఎందుకు కాలేదో చెప్పాలి. కల్తీ విత్తనాలే ఇందుకు కారణం.
– మారంశెట్టి కృష్ణ, కోయచెలక,
రఘునాథపాలెం మండలం
అయోమయంలో ఉన్నాం..
రెండు ఎకరాల్లో ఓంకార్ విత్తనాలతో సాగుచేశా. 40 రోజుల్లోనే ఈనుతుండడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇప్పటికే పెట్టుబడి ఎక్కువైంది. కంపెనీ వాళ్లు, అధికారులు, శాస్త్రవేత్తలు చూసి వెళ్తున్నా లాభం కనిపించడం లేదు.
– చెరుకూరి నరేష్, కోయచెలక, రఘునాథపాలెం
మునుపెన్నడూ జరగలేదు..
ఏటా యాసంగిలో వరి వేస్తున్నా గతంలో ఎలా ఎప్పుడూ జరగలేదు. మా గ్రామంలో 40 మందికి పైగా ఓంకార్ రకం వరి విత్తనాలు నాటాం. కానీ కంకి సరైన పొడవు రావడం లేదు. ఈసారి పంట చేతికి వచ్చే పరిస్థితి కానరావడం లేదు.
– మద్దాల శ్రీను, కోయచెలక, రఘునాథపాలెం
పరిహారం ఇప్పించాలి..
ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం విత్తనాన్ని 30 ఎకరాల్లో సాగు చేశా. నాటు వేసిన 15 రోజుల నుంచే పొట్టదశకు, 30 రోజుల్లో ఈనే దశకు వచ్చింది. దీంతో దిగుబడిపై ప్రభావం పడుతుంది. ప్రభుత్వమే పరిహారం ఇప్పించి ఆదుకోవాలి.
– పులగం అంజిరెడ్డి, రేజర్ల, సత్తుపల్లి మండలం
●
![40 రోజుల్లోనే వరి ఈనింది..
1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05ckm32-600615_mr-1738780850-1.jpg)
40 రోజుల్లోనే వరి ఈనింది..
![40 రోజుల్లోనే వరి ఈనింది..
2](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05ckm33-600615_mr-1738780850-2.jpg)
40 రోజుల్లోనే వరి ఈనింది..
![40 రోజుల్లోనే వరి ఈనింది..
3](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05ckm34-600615_mr-1738780851-3.jpg)
40 రోజుల్లోనే వరి ఈనింది..
Comments
Please login to add a commentAdd a comment