‘కాంగ్రెస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలి’

Published Fri, Apr 19 2024 1:45 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు - Sakshi

కాగజ్‌నగర్‌ రూరల్‌: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే హరీశ్‌బాబు బహిరంగ లేఖ రాశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద మంత్రి సీతక్క పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణానికి చెందిన ఒక మహిళా వైద్యురాలిని బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారన్నారు. లోకసభ ఎన్నికల ఫండ్‌ పేరిట, సీతక్కకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్‌లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి సీతక్క పేరును వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు గోలెం వెంకటేశ్‌, సిర్పూర్‌ అసెంబ్లీ కన్వీనర్‌ గొల్లపల్లి వీరభద్రచారి, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయా, పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్‌, జిల్లా దళిత మోర్చా నాయకులు ఈర్ల విశ్వేశ్వర్‌, కొప్పుల శంకర్‌, సత్పుతె తుకారాం, పవన్‌ పురోహిత్‌, మామిడి బాలాజీ, మోహన్‌, భీమేశ్‌, జనార్దన్‌, సంతోశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

ఎమ్మెల్యేపై ఫిర్యాదు

కాగజ్‌నగర్‌రూరల్‌: అసత్యపు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌ గురువారం పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేరు చెప్పి మహిళా వైద్యురాలిని బెదిరించి ఎన్నికల ఫండ్‌ పేరిట రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు అసత్యపు ఆరోపణలు చేశారన్నారు. తనను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement