సారూ.. బడి కట్టించండి
ఆసిఫాబాద్‌రూరల్/ఆసిఫాబాద్‌అర్బన్: ‘మా బడి పాతబడింది.. పంచాయతీ భవనంలోని ఒకే గదిలో అందరినీ ఉంచి బోధిస్తున్నారు.. సార్లు మాకు కొత్త బడి కట్టించండి..’ అంటూ ఆసిఫాబాద్ మండలం వావుదాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్‌కు వేర్వేరుగా వినతిపత్రం అందించారు. వావుదాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 46 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2019 నుంచి ఏడాది పాటు స్థానిక రైతువేదికలో తరగతులు నిర్వహించారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగిస్తున్నారు. కలెక్టర్ స్పందించి పాఠశాలకు పక్కా భవనం నిర్మించేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు కోరెంగ జలపతి, భీంరావు, రాంచందర్, కై లాస్, రాము, ఆనంద్‌రావు, లక్ష్మణ్, సోంజీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment