● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ● అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని.. ● కోరుతున్న విద్యార్థిని లోకం ● డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ డిబేట్‌ | - | Sakshi
Sakshi News home page

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ● అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని.. ● కోరుతున్న విద్యార్థిని లోకం ● డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ డిబేట్‌

Published Wed, Jan 1 2025 12:15 AM | Last Updated on Wed, Jan 1 2025 12:15 AM

● 202

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

2024 సంవత్సరం త్వరగా ముగిసింది

మా కళాశాలలో అధ్యాపకులు విద్యార్థినులందరికీ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారు. వారానికోసారి అవగా హన తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి 2024 సంవత్సరం ఇంత త్వరగా గడిచిందా.. అనిపిస్తోంది. 2025లో బ్యాంక్‌ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.

– సాయిప్రియ, ఫైనలియర్‌

2025లో అంతా మంచే జరగాలని..

ఆసిఫాబాద్‌లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పడిన నుంచి నేను నా ఇద్దరు స్నేహితులతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న. స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదు.. అన్న ఓ సినీ కవి మాట అక్షర సత్యం. మా ముగ్గురి ప్రాణం ఒక్కటే అనేలా మా స్నేహ బంధం ఆది నుంచీ కొనసాగుతోంది. అతి మధురమైనది స్నేహం. మా స్నేహం ఇంతకుముందు లాగా 2025 సంవత్సరంలోనూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్న.

– హారిక, పీడీ

దేశసేవ చేయాలని ఉంది

నేను డిగ్రీలో చేరిన తరువాత సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఎన్‌సీసీ లీడర్‌గా పని చేసిన. ఇటీవల ఎన్‌సీసీ ఫైరింగ్‌ నేషనల్‌ లెవెల్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్న. ఆర్మీలో ఉద్యోగం సాధించి దేశసేవ చేయాలనేది నా లక్ష్యం. 2025లో తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తాను.

– వాణిశ్రీ, ఫైనలియర్‌

రక్షణ చర్యలు చేపట్టాలి

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దాడులు జరిగినపుడు మహిళలు ప్రతిఘటించాలి. అందుకే నేను ఎన్‌సీసీలో చేరాను. ఆత్మరక్షణ కోసం కరాటే, యోగా నేర్చుకుంటున్న. 2025లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌, డిగ్రీ బాలికలకు కరాటే నేర్పించేలా మంచి నిర్ణయం తీసుకోవాలి.

– పద్మావతి, ఫైనలియర్‌

సంతోషంగా ముగిసింది

మా కళాశాలలో చదువుతోపాటు సమాజంలో మహిళలు ఎలా ఉండాలో తెలుపు తూ క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తున్నారు. 2024 సంతోషంగా ముగిసింది. 2025 కూడా ఇలాగే ఆనందంగా సా గాలని దేవుడిని కోరుకుంటున్న. 2025లో పోలీస్‌ ఉద్యోగం సాధించడమే లక్ష్యం.

– అమ్మిరిన్‌బాను, బీకాం సీఏ

ఆసిఫాబాద్‌రూరల్‌:

2024 కాలగర్భంలో కలిసిపోయింది. 2025 రానే వచ్చింది. గతేడాది ఎన్నో ఒత్తిడులు, ఓటమిలను జయించిన వారంతా నూతన సంవత్సరంలోకి కోటి ఆశలు, కొంగొత్త ఆశయాలు, సరికొత్త లక్ష్యాలతో అడుగిడుతున్నారు. నయా సాల్‌లో ఏదో సాధించాలన్న ఆరాటం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని మహిళా గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థినులు 2024లో వారి అనుభవాలు తెలిపారు. 2025 వారి ఆశలు.. లక్ష్యాలను వెల్లడించారు. మంగళవారం కళా శాలలో ‘సాక్షి’ నిర్వహించిన డిబేట్‌లో వారి మనోగతం వెల్లడించారు. కొత్త ఏడాదిలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థినులు

అమ్మమ్మకు అండగా ఉంటా

నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్‌ చదివాను. 2022లో ఈ కళాశాలలో చేరాను. అందరితో కలిసిమెలిసి చదువుకుంటున్న. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి మా అమ్మ ఆశయాలను నిజం చేసి తాతయ్య, అమ్మమ్మకు తోడుగా ఉంటా.

– పల్లవి, ఫైనలియర్‌

మంచిరోజులు వస్తాయని..

చదువుతో పాటు నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. యోగా, రన్నింగ్‌, బాక్సింగ్‌లో నేను గోల్డ్‌ మెడల్‌ సాధించాను. నాకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే బాక్సింగ్‌లోనూ మరింత రాణిస్తాననే నమ్మకముంది. 2025లో మంచి జరగాలని, నాకు మంచి రోజులు రావాలని ఆశిస్తున్న.

– కుడ్మెత శ్రీదేవి, ఫైనలియర్‌

ఆర్మీ పోలీస్‌ను అవుతా

నేను ఎన్‌సీసీలో చేరాను. ఎన్‌సీసీ లో సమాజం పట్ల ఎలా ఎండాలి.. క్రమ శిక్షణతో ఎలా మెలగాలో నే ర్పుతున్నారు. ఆర్మీ పోలీస్‌ ఉద్యో గం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత కష్టమైనా ఈ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకుపోతాను. తప్పనిసరిగా ఆర్మీ పోలీస్‌ను అవుతాను.

– వైష్ణవి, సెకండియర్‌

ఆకాంక్షలు నెరవేరాలని..

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోధిస్తున్నాం. వారు మంచి ప్రయోజకులుగా తయారు కావాలని ఆశిస్తున్నాం. 2025లో విద్యార్థినుల కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాం.

– శారద ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●1
1/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●2
2/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●3
3/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●4
4/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●5
5/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●6
6/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●7
7/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●8
8/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●9
9/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●10
10/10

● 2025 అంతా బాగుండాలని.. ● అందరి ఆకాంక్ష నెరవేరాలని.. ●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement