పత్తి కొనుగోళ్లు నిలిపివేత
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి, గింజల నిల్వలు అధికంగా ఉండటంతో ఈనెల 3, 4 తేదీల్లో, రెబ్బెన మండలం కొండపల్లి, సిర్పూర్, కౌటాల జిన్నింగ్ మిల్లుల్లో 3నుంచి 5వరకు సీసీఐ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి తేదీల నుంచి యథావిధిగా కొనుగోళ్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
బాలకార్మికుల గుర్తింపు
ఆసిఫాబాద్: 11వ విడత ఆపరేషన స్మైల్‌లో భాగంగా జిల్లాలో 57 మంది బాల కార్మికులను గుర్తించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా జనవరి 1 నుంచి 31 వరకు సర్వే చేసి ఆసిఫాబాద్ డివిజన్‌లో 21 మంది బాలురు, కాగజ్‌నగర్ డివిజన్‌లో 33 మంది బాలురు, ముగ్గురు బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రల వద్దకు చేర్చినట్లు పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలబాలికలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, బాలకార్మికులను ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment