టీఏసీ సభ్యుడిగా ఖాండ్రే విశాల్
ఆసిఫాబాద్: రాష్ట్ర టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు ఖాండ్రే విశాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాల్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీలో పని చేసే నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు. విశాల్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ చొరవతో గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనను గుర్తించి నామినేటెడ్ పదవి కట్టబెట్టారని పేర్కొన్నా రు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నాక విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోని శ్రీశైలం, సీనియర్ నాయకుడు బోనగిరి సతీశ్‌బా బు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు కృష్ణ కుమారి, సొల్లు లక్ష్మి, ఎలగతి సుచిత్, శ్రవణ్‌గౌడ్, ఇగురపు సంజీవ్, ఈదులవాడ గణేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment