జాతర ఘనంగా నిర్వహించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 11నుంచి 13వరకు నిర్వహించనున్న జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అన్ని శాఖల అధికా రులు, జాతర కమిటీ ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని అందంగా ముస్తాబు చే యాలని సూచించారు. శాఖల వారీగా చేయాల్సిన పనులు, కల్పించాల్సిన వసతుల గురించి వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆలయాన్ని సందర్శించి బాలాజీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డీపీవో భిక్షపతిగౌడ్, సింగరేణి ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీఎంహెచ్‌వో సీతా రాం, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ, సీఐలు స్వామి, రాణాప్రతాప్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఎస్సై చంద్రశేఖర్, ఎంపీవో వాసుదేవ్, డీఈఈ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment