పఠనాసక్తిని పెంచాలి
ఆసిఫాబాద్‌అర్బన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని డీఈవో యాదయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి రీడతాన్ పఠన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక దశలోనే విద్యార్థులు కథలు, నీతి కథలు, నూతన ఆవిష్కరణల పుస్తకాలు చదివితే మేధస్సు పెరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి 300 చొప్పున పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 47 స్కూల్ కాంప్లెక్స్‌ల నుంచి 94 మంది కాంప్లెక్స్ స్థాయి రీడతాన్ పఠన పోటీల విజేతలు జిల్లా స్థాయి పోటీలకు హాజరైనట్లు తెలిపారు. విద్యార్థుల పఠన సామర్థ్యం ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించినట్లు పేర్కొన్నారు.
విజేతలు వీరే..
జిల్లా స్థాయి పోటీల్లో తెలుగు మాధ్యమంలో సంజన (ఎంపీయూపీఎస్‌సీ, చిన్నరాస్‌పల్లి) ప్రథమ, జోగేశ్ (ఎంపీపీఎస్, తుమ్మలగుడ, బెజ్జూర్) ద్వితీయ, మహేశ్వరి (యూపీఎస్, కౌటి, కౌటాల) తృతీయ, ఆంగ్ల మాధ్యమంలో సాయి హంషిత్ (ఎంపీఎస్, కోయగుడ) ప్రథమ, అనిల్ (ఎంపీపీఎస్, సర్‌సిల్క్) ద్వితీయ, చైతన్య (ఎంపీపీఎస్, వంకులం, రెబ్బెన) తృతీయ బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, బీఈడీ కళాశాల కరస్పాండెంట్ శివప్రసాద్, ప్రిన్సిపాల్ రాజేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
హక్కులకు భంగం కలిగించొద్దు
Comments
Please login to add a commentAdd a comment