సబ్‌జైలును సందర్శించిన జిల్లా జడ్జి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధానన్యాయమూర్తి అరుణసారిక శనివారం మచిలీపట్నంలోని సబ్‌జైలును సందర్శించారు. సబ్‌జైలులో ముద్దాయిలకు న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. ముద్దాయిలకు అందుతున్న న్యాయసహాయం వివరాలను అడిగి తెలుసుకోవడంతోపాటు జైలులో వారికి కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవీ రామకృష్ణయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డెప్యూటీ జైలర్ బొత్స అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment