జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో చంద్రబాబు పాప ప్రక్షాళన ప
ఏడుకొండలపై కొలువున్న ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడిని మరోసారి దర్శించుకున్నట్టు భక్తజనం భావిస్తారు. అంతటి పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు విష ప్రచారం చేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారంటూ అసత్య ప్రచారం చేశారు. లడ్డూ ప్రసాదం విశిష్టతను, టీటీడీ ఖ్యాతిని మంట గలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళనకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అబద్ధాలాడుతున్న చంద్రబాబుకు, డెప్యూటీ సీఎం పవన్‌కు, కూటమిలో ఇతర నేతలకు శ్రీనివాసుడు సద్బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు.
అవనిగడ్డ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి
అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో, అవనిగడ్డలోని నారాయణస్వామి ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు జరిపించారు. కోడూరులో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కంకిపాడు: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అంశం.. చంద్రబాబు కుట్రేనని వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. తెలుగువారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను సైతం చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. కల్తీ జరిగిందంటూ విషం కక్కుతున్న చంద్రబాబు, టీటీడీ ఈఓ శ్యామలరావు నోర్లు శుద్ధి కావాలంటూ పూజలు చేశారు. పాప ప్రక్షాళన పూజల్లో గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఆ అభాండాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఆపాదించడాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో సాగుతున్న కుట్రపూరిత రాజకీయాలను ఖండిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కృష్ణాజిల్లా వ్యాప్తంగా శనివారం ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.
● జిల్లా కేంద్రమైన మచిలీపట్నం బచ్చుపేటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఆలయంలో గోవింద నామస్మరణ చేశాయి. జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ ఈఓ, చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. లడ్డూ కల్తీ పాపం చంద్రబాబుదే అన్నారు. అబద్ధాలు చెప్పే చంద్రబాబు, టీటీడీ ఈఓ నోర్లు శుద్ధి చేయాలని చెప్పారు.
● పామర్రు నియోజకవర్గంలోని మంటాడ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ పూజలు చేయించారు. నియోజకవర్గం వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి చంద్రబాబు మనసు మారాలని పూజలు చేశారు. గోవిందా గోవిందా అంటూ పార్టీ కార్యకర్తలు చేసిన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది
● పెడన నియోజకవర్గంలోని పెడన 11వ వార్డులో వేంచేసిన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కృత్తివెన్ను జెడ్పీటీసీ ఎం.రత్నకుమారి, బంటుమిల్లి జెడ్పీటీసీ వెంకటరత్నం, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, పలువురు పార్టీ శ్రేణులు పూజల్లో పాల్గొన్నారు.
● గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని వైష్ణవ, రామమందిరాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, రూరల్ ఎంపీపీ పుష్పరాణి, పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు.
●గన్నవరం నియోజకవర్గంలో గన్నవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చంద్రబాబుకు సద్బుద్ధి రావాలని పూజలు చేయించారు. జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్ రాణి, వైస్ ఎంపీపీ కె.శివనాగరాజకుమారి, ముస్తాబాద్ సొసైటీ మాజీ అధ్యక్షుడు మేచినేని బాబు తదితరులు పాల్గొన్నారు. ఎనికేపాడులో జరిగిన పూజల్లో గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ కొమ్మా కోట్లు, గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదు శివరామకృష్ణ ఇతర నేతలు పాల్గొన్నారు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లోని ఆలయాల్లో పూజలు జరిగాయి.
● పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు విష్ణాలయంలో పూజలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నే చిట్టిబాబు, జెడ్పీటీసీ బాకీ బాబు, పలు కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తన స్వార్థ రాజకీయం కోసం భగవంతుడిని సైతం రోడ్డుకి తెచ్చే ఘనుడు చంద్రబాబు అంటూ నేతలు విమర్శించారు. జగనన్నకు అండగా ఉంటామని స్పష్టంచేశారు.
పూజల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు
Comments
Please login to add a commentAdd a comment