విజయేశ్వరస్వామి వారి ఆలయం
దుర్గగుడి దిగువన కనకదుర్గనగర్ సమీపంలో ఉన్న ఆలయమే విజయేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారిని పాండవ మధ్యముడైన అర్జునుడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఆలయ గాధను పరిశీలిస్తే... ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వ్యాసమహర్షి సూచన మేరకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. అర్జునుని పరీక్షించాలని భావించి మాయాకిరాతకుడి వేషంలో ఇంద్రకీలాద్రిపై ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడిని పరీక్షించిన పరమేశ్వరుడు నిజరూపంలో అర్జునునికి దర్శనమిచ్చి పాశుపతా స్త్రాన్ని బహూకరించాడు. అర్జునుడు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తుతించి ఇంద్రకీలాద్రిపైనే దక్షిణ భాగాన ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. కాలక్రమంలో ఈ ఆలయం విజయేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment