కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2024
7
బాధ్యతల స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో ఏడీఎంఈగా డాక్టర్ డి. వెంకటేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా గతంలో పని చేశారు. వైద్యులు, సిబ్బంది అభినందించారు.
నాటి అవినీతికి ఆనవాళ్లుగా 22 ఎత్తిపోతల పథకాలు
మైలవరం నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల వివరాలు
గ్రామం నీటి వనరు నిర్మాణ విలువ
రూ.లక్షల్లో
వెలగలేరు బుడమేరు 298.02
కందులపాడు పోలవరం ఫీడర్ 40.57
వెల్లటూరు పోలవరం ఫీడర్ 109.10
జి.కొండూరు పులివాగు 41.65
గంగినేని పులివాగు 18.42
కుంటముక్కల బుడమేరు 33.70
ఆత్కూరు బుడమేరు 190.00
చెర్వమాధవరం పులివాగు 130.58
హెచ్ ముత్యాలంపాడు బుడమేరు 51.48
దుగ్గిరాలపాడు ఎన్‌ఎస్‌పీ 54.80
బీమవరప్పాడు బుడమేరు 21.25
తెల్లదేవరపాడు ఎన్‌ఎస్‌పీ కాల్వ 23.80
కోడూరు బుడమేరు 88.50
దాసులపాలెం బుడమేరు 222.68
తోలుకోడు బుడమేరు 195.80
జనగాలపల్లి బుడమేరు 116.00
మైలవరం బుడమేరు 38.25
రాయుడిపాలెం ఎన్‌ఎస్‌పీ కాల్వ 23.70
అన్నేరావుపేట ఎన్‌ఎస్‌పీ కాల్వ 37.28
పాతనాగులూరు కోతులవాగు 97.00
రెడ్డిగూడెం ఎన్‌ఎస్‌పీ కాల్వ 45.19
మూలపాడు వీటీపీఎస్ వాటర్ 380.00
కోనేరుసెంటర్: వాహనచోదకులు హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాలు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు పేర్కొన్నారు. హెల్మెట్ వాడకంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ శనివారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కోనేరుసెంటర్‌లో ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. సిబ్బందితో కలిసి నగరంలో బుల్లెట్ నడుపుతూ వాహనచోదకులకు హెల్మెట్ ధారణతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు. కోనేరుసెంటర్ నుంచి బస్టాండ్, జిల్లా కోర్టు సెంటర్, లక్ష్మీటాకీస్ సెంటర్, పరాసుపేట, నాయర్‌బడ్డీ సెంటర్, రామానాయుడుపేట, కోటావారితుళ్ల సెంటర్ మీదుగా కోనేరు సెంటర్‌కు చేరుకుంది. అనంతరం ఎస్పీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారన్నారు. అందుకు కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని చెప్పారు. యాక్సిడెంటల్ డెత్ అంటే వ్యక్తి చనిపోవడం మాత్రమే కాదన్నారు. ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడిపోవటం కూడా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ట్రాఫిక్ సీఐ ఏవీ శివకుమార్, చిలకలపూడి, ఆర్‌పేట, ఇనగదురుపేట సీఐలు నభీ, ఏసుబాబు, పరమేశ్వరరావు పాల్గొన్నారు.
నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలు ఒట్టి కోతలుగా మిగిలాయి. మైలవరం నియోజకవర్గంలో రూ.22.57 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఎత్తి పోయకపోవడంతో రైతుకు తీరని కష్టం మిగులుస్తున్నాయి. ఎత్తిపోతల పథకాలు నాటి టీడీపీ నేతలకు ఆదాయవనరుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ‘పథకాల్లో’ జలసవ్వడి లేక వెలవెలబోతున్నాయి. పాలకులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
జి.కొండూరు: నాటి టీడీపీ ప్రభుత్వ అవి నీతికి ఆనవాళ్లుగా ఉన్న ఎత్తిపోతల పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆ పథకాల్లో కొన్ని నీరులేక వెలవెలబోతుంటే మరి కొన్ని నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఇటీవల వచ్చిన వరద ఉధృతికి కొన్ని ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లు, షెడ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని నీటి ముంపునకు గురై మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొస్తే సాగునీటి సమస్య తలెత్తకుండా ఉంటుందని రైతులు కోరుతున్నారు. అంతే కాకుండా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు, విద్యుత్ పరికరాలను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రజాధనం దుర్వినియోగం
మైలవరం నియోజకవర్గంలో రూ.22.57 కోట్లతో 22 ఎత్తిపోతల పథకాల్లో 33 చెరువులు నింపి 6,443 ఎకరాలకు సాగు నీరందించడానికి 2014–19 మధ్య కాలంలో రూపకల్పన చేసి నిర్మించారు. అయితే చెరువుల విస్తీర్ణానికి, నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు ఏ మాత్రం సంబంధంలేదు. నిర్మించిన వాటిలో ఒకటి రెండు మినహా అసలు నీరే అందుబాటులోలేని పులివాగు, బుడమేరు, ఎన్‌ఎస్‌పీ కాల్వలపై ఎత్తిపోతల పథకాలు నిర్మించడంతో పలుచోట్ల నిరుపయోగంగా మారాయి. నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేవలం తన అనుచరులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తప్ప రైతులకు సాగునీరందించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలను రూపకల్పన చేయలేదనే విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. నాడు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం ఆయన అనుచరులు కావడంతో నాణ్యత గాల్లో కలిసిపోయిందనే విమర్శలు ఉన్నాయి. పైపులైను ఏర్పాటు, షెడ్ల నిర్మాణం, మోటార్ల కొను గోలులో కూడా చేతివాటం ప్రదర్శించి రూ.10కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా పలు చోట్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండానే బిల్లులు నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఎత్తిపోతల పథకాన్ని
పునర్నిర్మించాలి
పులివాగు మీద నిర్మించిన చెర్వుమాధవరం ఎత్తి పోతల పథకం ఇటీవల వచ్చిన వరద ఉధృతికి ధ్వంస మైంది. ఈ పథకం నిర్మించిన నాటి నుంచి సక్రమంగా పనిచేయలేదు. మోటార్ల ద్వారా గ్రంథివాని చెరువుకు నీరు వదిలినప్పుడు పైపులు పగిలిపోయేవి. ప్రభుత్వం పునర్నిర్మించి నాణ్యమైన పైపులు ఏర్పాటు చేయాలి.
– రమావత్ శ్రీను, రైతు,
మునగపాడు గ్రామం, జి.కొండూరు
మరమ్మతులు వెంటనే చేయాలి
మా గ్రామంలోని సావరాల చెరువు కింద ఆరు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. మా చెరువుకు సాగునీరు కోసం హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరద ఉధృతికి ఎత్తిపోతల పథకం ముంపునకు గురైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపడితే మాకు సాగునీటి సమస్య లేకుండా పోతుంది. లేదంటే ఇబ్బంది పడతాం.
– దొడ్డా విష్ణువర్ధన్‌రావు, రైతు,
ఆత్కూరు, జి.కొండూరు
న్యూస్‌రీల్
వరద ఉధృతికి మోటార్లు, పైపులు ధ్వంసం నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం
Comments
Please login to add a commentAdd a comment