ఇంద్రకీలాద్రిపై సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజ గోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.
హోరాహోరీగా
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న 68వ లేపీ స్కూల్‌గేమ్స్ అంతర జిల్లాల (అండర్–17) బాలబాలికల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు రెండోరోజైన ఆదివారం కొనసాగాయి. పోటీల్లో 55 కిలోల బాలుర విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన జి.జయసాయికృష్ణ స్కాచ్‌లో 60 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 90 కిలోలతో సహా మొత్తం 150 కిలోలతో ప్రథమ స్థానం సాధించాడు. కడప, విశాఖకు చెందిన లిఫ్టర్లు ద్వితీయ, తృతీయ బహుమతులను గెలిచారు. బాలికల 40 కిలోల విభాగంలో పశ్చిమగోదావరి, 45 కిలోల విభాగంలో తూర్పుగోదావరి లిఫ్టర్లు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ పోటీలకు ఎస్.కోటేశ్వరరావు, సీహెచ్ గోపీనాథ్, ఎ.వెంకటరామిరెడ్డి న్యియనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాగశిరీష, వ్యాయామ అధ్యాపకుడు రమేష్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఎం.రవికుమార్ పర్యవేక్షించారు.
నలుగురి అరెస్ట్
3 కేజీల గంజాయి స్వాధీనం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): గంజాయి కలిగి ఉన్న నలుగురు యువకులను కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేసి వారి నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంబాడీపేట సాయిరాం, ప్రసాద్ థియేటర్ల వద్ద కొంత మంది గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కొత్తపేట సీఐ కొండలరావు లంబాడీపేటలో నిఘా పెట్టారు. సాయిరాం థియేటర్ ఎదురుగా సముద్రాల వారి వీధికి చెందిన మంగళగిరి అజయ్ దుర్గాప్రసాద్ అలియాస్ బండ అజయ్‌తో పాటు గన్నవరానికి చెందిన చేబ్రోలు ధన కోటేశ్వరరావు, జిజ్జువరపు రత్నభాస్కర్, నున్నకు చెందిన భౌరిశెట్టి సింహాచలం గంజాయి కలిగి ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. నిందితుల వద్ద 3 కేజీల గంజాయి ఉండటంతో వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment