ముగిసిన కూచిపూడి నృత్యోత్సవాలు
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ కనక దుర్గానాట్యమండలి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న నాట్యాచార్య యల్లాజోస్యుల రామకృష్ణ నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. పారుపల్లి రామచంద్రమూర్తి కథా సహకారం అందించగా, నాట్యాచారిణి యల్లా జోస్యుల అనూరాధ నృత్య దర్శకత్వం వహించిన స్వామియే శరణమయ్యప్ప నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది వేముల హజరత్తయ్య మాట్లాడుతూ కూచిపూడి నృత్య సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నృత్యరంగానికి ప్రతేక నిధులను కేటాయించాలని కూచిపూడి నృత్య సంప్రదాయాలను పరిరక్షించాలని సూచించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, నాట్యాచార్యులు డాక్టర్ చింతారవిబాల కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, ఉమామహేశ్వర పాత్రుడు పాల్గొన్నారు. నేతి విద్యాసాగర్, వై. అనూరాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment