ఆగని విధ్వంసం
ఆటోనగర్(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల అరాచకం సృష్టించిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు.. ప్రశాంతంగా ఉండే 15వ డివిజన్‌లో శనివారం అర్ధరాత్రి మరోసారి తెగబడ్డారు. కరకట్టరోడ్డులోని పడవల రేవు వద్ద ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్, అందులో ఉన్న రెండు ఫొటోలు, వైఎస్సార్ సీపీ పార్టీ జెండాల దిమ్మెలు, శిలాఫలకాలను జనసేన డివిజన్ అధ్యక్షుడు అమ్ములుతో పాటు 10 మంది కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఏడు కార్లలో వారు వచ్చి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పథకం ప్రకారమే..
కూటమి నేతలు ఒక ప్లాన్‌ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పడవలరేవు కరకట్టరోడ్డు జంక్షన్ వద్ద పది మంది కూర్చునేందుకు గానూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆళ్ల చెల్లారావు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. ఈ బల్లలను పగులకొట్టి టీడీపీ రంగువేసి మరలా సిమ్మెంట్ బల్లలను రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారు. 15వ డివిజన్ జనసేన నాయకుడు అమ్ములు దగ్గరుండి తమ కార్యకర్తలతో ఈ విధ్వంసం చేయించినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టమైంది.
రంగు మార్చాలని ఒత్తిడి..
దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల క్రితం చిరువ్యాపారులు, పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లక్షల రూపాయలను వెచ్చించి వీటిని ఉచితంగా పంపిణీ చేశారు. ఆ బండ్లకు ఉన్న వైఎస్సార్ సీపీ రంగు మార్చి.. పసుపు రంగు వేసుకోవాలని ప్రస్తుత కూటమి నాయకులు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఆ రంగు మార్చకుంటే దాడులు చేస్తామని, ఏదో ఒక కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ దిమ్మెలను పగులకొట్టిన కూటమి నాయకులు వాటి స్థానంలో టీడీపీ దిమ్మెల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment