కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలి
వేడుకగా ఎక్స్‌రే కవితా పురస్కారాల సభ
విజయవాడ కల్చరల్: కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలని సాహితీవేత్త మొండెపు ప్రసాద్ అన్నారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యాన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం ఎక్స్‌రే కవితా పురస్కారాలు–2023 సభను నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రసాద్ మాట్లాడుతూ కవులు సమాజంలో భాగస్వాములు కావాలని సూచించారు. కవితల పోటీ న్యాయనిర్ణేత ముంగారి రాజేంద్రర్ మాట్లాడుతూ ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ నిరంతర సాహిత్య పాఠశాలని, ఏటా జాతీయ స్థాయిలో కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ అధ్యక్షుడు సంస్థ లక్ష్యాలను వివరించారు. వివిధ రంగాలకు చెందిన వేణుగోపాల్, కొమ్మెర్ల కృష్ణవేణి, సింగంపల్లి అశోక్‌కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. 2023 సంవత్సరానికి గానూ ఎక్స్‌రే ప్రదాన పురస్కారాన్ని కరీంనగర్‌కు చెందిన నామిని సుజనాదేవికి అందించారు. కోరాడ అప్పలరాజు, చొక్కర తాతారావు, ఎన్. లహరి, డాక్టర్ రాధాశ్రీ. రేపాక రఘునందన్, జగన్నాథం రామమోహన్, నెల్లుట్ల రమాదేవి, కమలేష్, పొత్తూరి సీతారామరాజు, వెంకు సనాతని ఉత్తమ కవితా పురస్కారాలు అందుకున్నారు. పోటీకి వచ్చిన కవితలను పుస్తకంగా ముద్రించి సభలో ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment