గ్రామాల్లో వసతులకు కేంద్రం నిధుల కేటాయింపు
పరిటాల(కంచికచర్ల): గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రణాళిక(జీపీఎస్‌డీపీ) రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనాథ్ నైనీ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు గురువారం డ్రోన్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రహదారుల అభివృద్ధి, అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా చేసేందుకు డ్రోన్‌తో పనులు గుర్తిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 29 రాష్ట్రాల్లో 34 గ్రామ పంచాయతీలను గుర్తించి వాటిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రామంలో మూడు రోజుల పాటు డ్రోన్ సర్వే జరుగుతుందని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ వినోద్‌కుమార్నుల్, జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్యకుమారి, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ బొజ్జగాని శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment