పటమట(విజయవాడతూర్పు): దుర్గా ఘాట్‌లో డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ పేరుతో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం దుర్గా ఘాట్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగే ప్రదే శాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెస్టివల్లో నదీ తారాన కర్నాటిక్ సంగీతం ఉంటుందన్నారు. ఈ వేడుకలకు భాగస్వాములైన దేవదాయ, టూరిజం అధికారుతో వీఎంసీ అధికారులు సమన్వయం చేసుకుని వేడుకలు వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జోనల్ కమిషనర్–1 రమ్య కీర్తన, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment