భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
కోనేరుసెంటర్: అపరిషృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గాలలోని ప్రతి గ్రామంలో మీ భూమి–మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ప్రజల వద్దకే పాలన..
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకే పాలనతో అధికారులను గ్రామాలకు పంపి సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. బందరు ఆర్డీఓ కె. స్వాతి, తహసీల్దార్ మధుసూదనరావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
Comments
Please login to add a commentAdd a comment