కథా రచయిత కాటూరి త్రివిక్రమ్ కన్నుమూత
విజయవాడ కల్చరల్: విజయవాడ నగరానికి చెందిన విఖ్యాత రచయిత, కాలమిస్ట్ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (79) బుధవారం ఉదయం కృష్ణలంకలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. నవల, కథ, నాటకం, పద్యం, గద్యం వంటి వాటిల్లో రెండు వేలకు పైగా రచనలు చేశారు. 1974లో ప్రారంభమైన ఆయన రచనా ప్రస్తానం 2024 వరకూ సాగుతూనే ఉంది. ఆయన 16 ఏళ్లు భారత వైమానిక దళంలో పని చేశారు. ఆకాశవాణి కేంద్రంలో ఆయన రచించిన కథలు, నాటికలు ప్రసారం అయ్యాయి. అనేక సాహిత్య పత్రికల్లో కాలమిస్ట్‌గా పని చేశారు. నగరానికి చెందిన సాహితీ సంస్థలు, సాహితీవేత్తలు త్రివిక్రమ్ మృతికి సంతాపం వ్యక్తం చేశాయి.
కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment