రేపు ప్రతిభా పురస్కారాల సభ
విజయవాడ కల్చరల్: సుఖమంచి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో 30వ తేదీ సోమవారం బందరు రోడ్డులోని బాలోత్సవ భవన్‌లో సుఖమంచి పబ్లికేషన్స్ ప్రతిభా పురస్కారాల సభను నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు సుఖమంచి కోటేశ్వరరావు తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. సుఖమంచి కోటేశ్వరరావు హస్యపుజల్లులు గ్రంథావిష్కరణ జరుగుతుందని తెలిపారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొంటారన్నారు. తొలుత దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సాహితీవేత్త జోష్ మేరీ, సంస్థ సభ్యులు స్రవంతి, జి. ఆనంద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment