సరికొత్త ఆశలతో.. న్యూ ఇయర్‌కు సిద్ధం
గుడ్లవల్లేరు: న్యూ ఇయర్ వేడుకలకు మార్కెట్లో
అంతటా సందడి వాతావరణం నెలకొంది. అన్ని వర్గాల ప్రజలు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. దీంతో వివిధ రకాల పూలు, కేకులకు ప్రాధాన్యం ఏర్పడింది. న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు వినియోగించే బోకేలను మార్కెట్లో ఇప్పటికే వివిధ డిజైన్లతో అందుబాటులోకి తెస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులు ఏదైనా వేడుక జరుపుకోవాలంటే రక రకాల పిండి వంటలు తయారు చేసుకునేవారు. ఇపుడు ఆ ట్రెండ్ మారిపోయి కొత్త ట్రెండ్‌కు నేటి తరం తెర తీశారు. ఇపుడు వేడుక ఏదైనా...కేకు ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. కేవలం బర్త్ డేకే గాక చిన్నా, పెద్దా తారతమ్యాలు లేకుండా పెళ్లి రోజులు, రాజకీయ నాయకుల పుట్టిన రోజులు, జయంతులకు సైతం కేకులను కట్ చేసి తమ అభిమానాన్ని వారి పట్ల చాటుకుంటున్నారు. ఈ కేకుల వాడకంతో బేకరీల యజమానులకు లాభాల పంట పండుతోంది. అన్నింటికీ ఒకేలా కేక్ తయారు చేసే పద్ధతికి కూడా వారు స్వస్తి చెప్పేశారు. వినియోగదారుల రుచి అభిరుచులకు అనుగుణంగానే వివిధ
ఆకృతుల్లో సృజనాత్మకతకు పదును పెట్టే కేకులు తయారు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు వివిధ రకాల ఆకారాల్లో కేకులను తయారు చేసే పనిలో వ్యాపారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని కొన్ని బేకరీల్లో అయితే నెల రోజుల ముందుగానే కేకులకు ఆర్డర్లు రావటంతో వారికి చేతి నిండా పని దొరికింది. ఇప్పటికే వేలాది కేజీల్లో కేకులు తయారు చేసేశారు. ఎగ్‌లెస్ కేకులూ కూడా
అందుబాటులో ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు.
నూతన ఏడాదికి సందడి ప్రారంభం కేకుల తయారీల్లో బేకరీల యజమానులు ట్రెండ్‌కు అనుగుణంగానే కేకుల తయారీకి ప్రాధాన్యం ఏ వేడుకకూ అయినా.. కేకులే ప్రస్తుత ట్రెండ్
ఆహా అనిపించేలా....
ప్రస్తుతం డ్రైఫ్రూట్ కేక్, కూల్ కేక్, ఫొటో కేక్, హనీ కేక్ వంటి రకాలు తయారు చేస్తున్నారు. ఈ కేకులు రుచిలోనూ మేటిగా మారాయి. వివిధ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. వెనిలా, బటర్ స్కాచ్, ఆరంజి, లెమన్, పైనాపిల్, ఆపిల్ వంటి
బ్రాండెడ్ కేకులను వినియోగదారులు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. న్యూ ఇయర్ కేకుల తయారీ అనేది వినియోగదారులను ఆహా అనిపించే విధంగా తయారవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment