కార్తికేయుని సేవలో గ్రెనడా హైకమిషనర్
మోపిదేవి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని భారతదేశంలో గ్రెనడా హై కమిషనర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మణిదీప్ శర్మ, విరూప్ కుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment