దాశరథికి స్వర నీరాజనం
విజయవాడకల్చరల్: నాదవినోద(యూఎస్‌ఏ), గంగాధర్ ఫైన్ ఆర్ట్స్, సుమధుర కళానికేతన్, కామ్రేడ్ జీఆర్‌కే సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి, సినీ గేయ రచయిత దాశరథి కృష్ణమాచారి శత జయంతి సందర్భంగా బుధవారం పీబీ సిద్ధార్థ కళాశాలలో దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి మణిదీప మాలిక పేరుతో సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సీనియర్ గాయని మణి శాస్త్రి ఆధ్వర్యంలో గాయనీ గాయకులు బాల కామేశ్వరరావు, శేషుకుమారి, వంశీధర్ ఇద్దరుమిత్రులు, పూజ, బుద్ధిమంతుడు, డాక్టర్ చక్రవర్తి, అమరశిల్పి జక్కన్న తదితర చిత్రాలలోని దాశరథి రచించిన గీతాలను మధురంగా ఆలపించారు. దాశరథి కవిత్వం సామాజిక అంశాల సమాహారం దాశరథి కవిత్వం సామాజిక అంశాల సమాహారమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. దాశరథి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన దళపతి చిత్రంలోని పాటను ఆలపించారు. కార్యక్రమంలో గోళ్ళ నారాయణరావు, డాక్టర్ ఎంసీదాస్, అంబటి మధుమోహనకృష్ణ, డాక్టర్ రొంపిచర్ల భార్గవి, డాక్టర్ బాలాంత్రపు ప్రసూన పాల్గొన్నారు. అనంతరం గాయని మణిశాస్త్రిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment