గాలిబుడగ జీవితాలు | - | Sakshi
Sakshi News home page

గాలిబుడగ జీవితాలు

Published Thu, Jan 2 2025 12:55 AM | Last Updated on Thu, Jan 2 2025 12:55 AM

గాలిబుడగ జీవితాలు

గాలిబుడగ జీవితాలు

గాలిబుడగల విక్రయమే ఆమెకు జీవనాధారం... ఆమె చేతిలో రంగురంగుల గాలిబుడగలు...ఆమె జీవితంలో మాత్రం అన్నీ వెలిసిపోయిన రంగులే...నాలుగు బుడగలు అమ్మితేనే ఆ పూట ఐదు వేళ్లు నోట్లోకెళ్లేది...లేదంటే పస్తులే...ఈ బతుకు ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు...రోడ్లపై పోలీసుల వేధింపులు...జీవితంలో ఎన్ని కష్టాలున్నా... చెదరని చిరునవ్వుతో బెలూన్లు విక్రయిస్తున్న ఆమె ఈ దేశపు సగటు పేదింటి ప్రతిబింబం. ఆమె లాంటి ఎందరో పేదల బతుకులు నిజంగా గాలిబుడగ జీవితాలే...విజయవాడ నగరంలో బందరురోడ్డుపై ఓ మహిళ రంగు రంగుల బెలూన్లు విక్రయిస్తున్న దృశ్యా న్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.

–సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement