12న కృష్ణానదిలో ఈత పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన రివర్ క్రాస్ స్విమ్మింగ్(విజయవాడ దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజీ వద్దనున్న లోటస్ సిటీ వరకు) పోటీలను నిర్వహిస్తున్నట్టు కార్యనిర్వాహక కార్యదర్శి మండపాటి లక్ష్మీనరసరాజు తెలిపారు. ఆ రోజు ఉదయం ఆరు గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, 11 నుంచి 18 ఏళ్ల వయసు, 19 నుంచి 30 ఏళ్ల వయసు, 31 నుంచి 40, 41 నుంచి 50, 51 నుంచి 60, 60 ఏళ్లు పైబడిన వయసు కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్‌లను అందజేస్తామని, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8686093646(నరసరాజు), 8639526332 (దాసరి యుగంధర్, కన్వీనర్)ను సంప్రదించాలని సూచించారు.
న్యాయశాఖ సిబ్బంది సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
చిలకలపూడి(మచిలీపట్నం): నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక బుధవారం ఆవిష్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా సంఘం తరఫున సిబ్బంది న్యాయమూర్తి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యాయమూర్తితో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సీహెచ్ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రంగవల్లుల్లో ఉట్టిపడిన గ్రామీణం
నూతన సంవత్సర వేడుకలు అనగానే యువత కేరింతలు, మద్యంబాబుల కిక్కులు, కేకుల కటింగ్‌లు, స్వీట్ల పంపకాలు, ఉన్నతాధికారులకు పుష్పగుచ్ఛాల అందజేతలే కాదు... మహిళలు గంటల తరబడి ఓపిగ్గా వేసే రంగవల్లుల గురించి కూడా చెప్పుకోవాలి. పెనుగంచిప్రోలులో ఓ మహిళ తన ఇంటి ముందు వేసిన రంగవల్లిలో తన కళా నైపుణ్యంతో గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దడం గమనార్హం.
–పెనుగంచిప్రోలు
Comments
Please login to add a commentAdd a comment