దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన
అభ్యర్థ్ధులకు ఈ నెల 30వ తేదీ నుంచి మొదలై వచ్చే నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సెలక్షన్స్‌కు విచ్చేసిన అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి సెలక్షన్స్‌కు సంబంఽధించిన అనేక అంశాలను వివరించారు. రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. సెలక్షన్స్‌ను పారదర్శకంగా నిర్వహించాలని ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తొలి రోజు జరిగిన సెలక్షన్స్‌కు 254 మంది హాజరుకాగా 171 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 83 మంది డిస్‌క్వాలిఫై అయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7908 మంది అభ్యర్థులకు జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. ప్రతి రోజు 600 మంది అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించేలా రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. మొదటి రోజు అభ్యర్థ్ధులకు 1600 మీటర్‌లు, 100 మీటర్‌ల పరుగుపందెంతో పాటు లాంగ్‌జంప్ పోటీలు నిర్వహించారు. అలాగే ఛాతీ, ఎత్తు కొలతలను పరిశీలించారు. సెలక్షన్స్‌కు హాజరైన అభ్యర్ధుల నుంచి ముందుగా నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాలు, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌లు, ఆధార్‌కార్డులు, స్టడీ సర్టిఫికెట్‌లు, మార్కుల జాబితాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, డీపీవో కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment