అక్రమ లే అవుట్లను గుర్తించి, ఆ యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వీటిలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి డబ్బులు దండుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ల రూపంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటాల పంపకాల్లో సైతం మునిసిపల్ అధికారి, టౌన్ ప్లానింగ్ అధికారి మధ్య విభేదాలు పొడచూపినట్లు సమాచారం. తన అనుమతి లేకుండా ప్లాన్‌కోసం దరఖాస్తు చేస్తే ఇచ్చే ప్రసక్తే లేదని, ఇచ్చే ముడుపుల్లో 60 శాతం వాటా ఇవ్వాలని మునిసిపల్ అధికారి బిల్డర్స్‌తో మీటింగ్ పెట్టి కరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారిని బదిలీ చేస్తే అన్ని ప్లాన్‌లు ఇస్తానని టౌన్ ప్లానింగ్ అధికారి బిల్డర్స్‌ను రెచ్చ గొడుతున్నట్లు చర్చ సాగుతోంది. అక్రమ లేఅవుట్‌కు ఎకరాకు రూ. 10 లక్షలు, సొంత భవన ప్లాన్‌కు రూ. లక్ష, గ్రూప్‌హౌస్‌కు రూ. 3 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఎకరాకు రూ.15 నుంచి రూ. 30లక్షలు సమర్పించుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. అనధికారికంగా ఫ్లోర్ నిర్మించుకుంటే రూ.4లక్షలు.. ఇందులో రూ.2లక్షలు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి ఇస్తున్నట్లు సమాచారం. ఓ అక్రమ లే అవుట్‌లో అనుమతులు ఇస్తామని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కోటి రూపాయలకు పైగా ముడుపులు తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికై నా మున్సిపల్‌శాఖ మంత్రి, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment