విజయవాడ రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ సర్టిఫికెట్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికులకు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతుల నిర్వహణకుగాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ ‘ఈట్ రైట్ సర్టిఫికెట్’ అందుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్ అందుకున్న స్టేషన్‌లలో విజయవాడ స్టేషన్ డివిజన్‌లో రెండవది కాగా దక్షిణ మధ్య రైల్వేలో ఐదో స్టేషన్. రైలు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం, ప్రామాణిక ఆహార నిల్వ, పరిశుభ్ర పద్ధతులు అంద జేయడం వంటి ప్రమాణాల ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రైల్వే స్టేషన్‌లకు ఈ సర్టిఫికెట్‌ను అందిస్తోంది.
ఇవీ ప్రమాణాలు..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాల ప్రకారం ఎఫ్‌ఓఎస్‌టీఏసీ (ఫుడ్ సేప్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్) పోగ్రామ్ ద్వారా క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్స్ యజమానులు, విక్రయదారుల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాల వినియోగం, ఆహార ఉత్పత్తుల గడువు తేదీ, ఆహార నిల్వ టెంపరేచర్‌లు, వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించి వాటిపై కమర్షియల్ అధికారులు, రైల్వే హాస్పిటల్ సీఎంఎస్ బృందం పర్యవేక్షణలో ప్రీ ఆడిట్ నిర్వహించారు. ఆరు నెలల తరువాత పూర్తిస్థాయి పర్యవేక్షణ, ముల్యాంకనం అనంతరం జనవరి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ అరుదైన రికార్డు సాధించడంలో కృషి చేసిన సీఎంఎస్ డాక్టర్ సౌరిబాల, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీసీఎం ఎండీ ఆలీఖాన్, స్టేషన్ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment