కోనేరుసెంటర్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్స్‌కు సంబంధించి ఈనెల 3, 4, 6 తేదీలలో జరిగిన సెలక్షన్స్ హాజరుకాని మహిళా అభ్యర్థులకు ఈనెల 21వ తేదీన మరోసారి సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు శుక్రవారం తెలిపారు. ఆయా తేదీల్లో హాజరు కాని అభ్యర్థులు 21వ తేదీన జరిగే సెలక్షన్స్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. అలాగే పురుష అభ్యర్థులకు ఈనెల 20వ తేదీతో సెలక్షన్స్ ముగుస్తున్నట్లు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment