గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి కె. శ్రీనివాస శిరోమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను డిసెంబర్ 26న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు గడువును 7వ తేదీ వరకు పొడగించారని తెలిపారు. అనంతరం జనవరి 11వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని పేర్కొన్నారు. జనవరి 17న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని వివరించారు.
మూడు దశల్లో తనిఖీ
పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేది వయసు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి వ్యవసాయం, ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతారాలను వీఆర్వో స్వీకరిస్తారన్నారు. వీటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి ఆర్‌ఐకి నివేదిస్తారు. ఆర్‌ఐ పునఃపరిశీలించి తహసీల్దార్‌కు రికమండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ వీఆర్వో, ఆర్‌ఐల నివేదికలో వివరాలను పరిశీలించి.. తుది ఆమోదం తెలిపి ఆ వివరాల్ని పోర్టల్‌లో పొందుపరుస్తారని తెలిపారు. వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించడానికిు సహాయ సాంఘిక సంక్షేమఅధికారులతో 50 మంది వివరాల్ని ర్యాండమ్ గా తనిఖీ చేయిస్తారన్నారు. ఈ సోషల్ ఆడిట్‌ను కలెక్టరు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తారని ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment