పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి రవీంద్ర
మచిలీపట్నంటౌన్: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం నగరంలోని 31వ డివిజన్ శారదనగర్‌లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ ప్రాంతా నికి చెందిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతు వులకు పింఛన్ నగదు అదజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. జన వరి ఒకటో తేదీ నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారులకులైసెన్సు పత్రాల అందజేత
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకార బోటు యజమానులకు మత్స్యశాఖ ద్వారా జారీ చేసిన రిజిస్ట్రేషన్, లైసెన్సు పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం తన చాంబర్‌లో అందజేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయవాడలో సంభవించిన వరదల ముందు బాధితులను రక్షించేందుకు అత్యవసరంగా బోట్లు అవసరమవగా కలెక్టర్ మంగినపూడి బీచ్ ప్రాంతానికి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి బోట్లను లారీల్లో అక్కడికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బోటు యజమానులకు బోటు రిజిస్ట్రేషన్, లైసెన్సు పత్రాలు ఆయన అందజేశారు. బోటు యజమానులు కలెక్టర్‌ను సత్కరించి కృత జ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్యకారుల నుంచి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్‌చార్జ్ జాయింట్ డైరెక్టర్ నాగబాబు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల అధ్యక్షుడు కొక్కిలిగడ్డ వెంకటరమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఉమ్మడి కృష్ణా క్రీడాకారులు
గన్నవరం: జాతీయ స్థాయి మోడ్రన్ పెంటతలాన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా ఇన్‌చార్జ్, కోచ్ డి. నాగరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ఉమ్మడి కృష్ణాకు చెందిన తలగడ దీవి కుషాల్, కోట వర్షంత్, డి.రాకేష్, కడవకొల్లు కింగ్‌జార్జ్ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. వారిని ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో నాసిక్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు నలుగురు క్రీడాకారులు నాసిక్ బయలుదేరి వెళ్లారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment