కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025
నేడు ‘మీ కోసం’
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భక్తుల కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే రద్దీ ఏర్పడింది.
గూడూరులోని ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థికి స్టడీ మెటీరియల్‌ను ప్రింట్ చేసుకోవాలని, లేదా తనకు రూ.500 ఇస్తే.. రెండు పుస్తకాలను ప్రింట్ చేయించి ఇస్తానని ఓ ఉపాధ్యాయుడు చెప్పారు. ఇదే విషయం తన తండ్రికి విద్యార్థి చెప్పగా.. ‘ఇదేమి విడ్డూరం రా.. నువ్వు చదివేది ప్రభుత్వ పాఠశాలలోనే కదా.. ప్రభుత్వం స్టడీ మెటీరియల్ సరఫరా చేయకుండా రూ.500 అడగటం ఏమిటి?’ అని కుమారుడితో అన్నాడు. గతంలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి చూసి ఆ తండ్రి అవాక్కయ్యాడు.
సాక్షి, మచిలీపట్నం: పేద విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం భారం వేస్తోంది. సర్కారు పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ పరీక్షలు రెండు నెలలు కూడా లేవు. ఇలాంటి సమయంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. ముఖ్యమైన ప్రశ్నలు, మోడల్ పేపర్స్‌తో మెటీరియల్‌ను అందించాలి. అయితే ప్రభుత్వం ఈ ఏడాది స్టడీ మెటీరియల్‌ను ప్రింటెడ్ పుస్తకం రూపంలో కాకుండా పీడీఎఫ్ సాఫ్ట్ కాపీ తరహాలో పంపింది. వాటిని అధికారులు ఎంఈఓలు, హెచ్‌ఎంలకు పంపించి, వాటిని ప్రింట్ తీయించుకోవాలని సూచించారు. ఆ ప్రింట్ భారం మనకెందుకని, విద్యార్థులపై వేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సిద్ధమైనట్లు సమాచారం. దీనిని బట్టి పేద విద్యార్థుల చదువుపై సర్కారుకు ఉన్న ప్రేమ ఏపాటితో స్పష్టమవుతోంది.
21వేల మంది విద్యార్థులు..
కృష్ణా జిల్లాలోని 403 ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూల్స్‌లో పదో తరగతి చదువుతున్న 21,044 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్ష రాయనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 145 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది 151 సెంటర్లలో 21,518 మంది పరీక్షలు రాయగా 19,474 (90.5శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులపై రూ.54.74లక్షల భారం..
జిల్లాలో మొత్తం 403 హైస్కూల్స్‌లో ప్రభుత్వ హైస్కూల్స్ (అన్ని యాజమాన్యాలు) 223 ఉన్నాయి. వాటిలో రెగ్యూలర్ విద్యార్థులు 10,949 మంది చదువుతున్నారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేసిన స్టడీ మెటీరియల్ ఏటా ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం సరఫరా చేయకుండా మెటీరియల్స్‌ను లాంగ్వేజెస్ బుక్ 200 పేజీలు, నాన్ లాంగ్వేజెస్ బుక్ 220 పేజీలు పంపింది. రెండు పుస్తకాలు ప్రింట్ వేసేందుకు రూ.500 వరకు అవుతుండగా, 10,949 మంది విద్యార్థులపై రూ.54.74లక్షల భారం పడుతుందని అంచనా. ఆరు సబ్జెక్టులు.. ఏడు ప్రశ్నపత్రాలుగా పరీక్షలు నిర్వహిస్తుండగా మారిన ప్రశ్నపత్రాలపై సాధన విద్యార్థులకు కష్టంగా ఉందని తెలుస్తోంది.
నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచేందుకు పర్యవేక్షణ బాధ్యతలు ఆయా మండలాల ఎంఈఓలపైనే కాకుండా జిల్లా అధికారులకు సైతం అప్పగించింది. విద్యార్థులను ఆయా సబ్జెక్టు టీచర్లకు దత్తత ఇచ్చేలా చర్యలు తీసుకుంది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలేవీ చేపట్టడం లేదని తెలుస్తోంది.
ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు (ఫైల్)
(ఇన్‌సెట్) లాంగ్వేజెస్ స్టడీ మెటీరియల్
7
న్యూస్‌రీల్
మార్చి 17 నుంచి పది పరీక్షలు
విద్యార్థులకు ఇప్పటికీ
అందని స్టడీ మెటీరియల్
పీడీఎఫ్ కాపీ పంపి ప్రింట్
చేయించుకోవాలంటున్న ప్రభుత్వం
రూ.54.74లక్షల భారం
విద్యార్థులపై వేసేందుకు యత్నం
ఆరు సబ్జెక్టులు.. ఏడు
ప్రశ్న పత్రాలతో పరీక్షలు
మారిన ప్రశ్న పత్రాలపై
సాధన చేయలేని విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment