![హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/5/04knl46a-200097_mr.jpg.webp?itok=TAtoQpWq)
హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి
కర్నూలు కల్చరల్: ‘మీటర్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి మంగళవారం కర్నూలులో సందడి చేశారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా వారు ఆనంద్ థియేటర్‌కు వచ్చారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మీటర్’ సినిమా ఈనెల 7వ తేదీన విడుదలవుతుందన్నారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
ప్రతి మండలంలో ప్లాంట్‌హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్లు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి మండలంలో ప్లాంట్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం గుంటూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... పంటలకు సోకే అన్ని రకాల సమస్యలకు ప్లాంట్ హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సెంటర్ల ఇన్‌చార్జీలకు మెటీరియల్ సిద్ధం చేశామని, శిక్షణ ఇచ్చేందుకు తగిన షెడ్యూలు రూపొందించుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. భూసార పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో సాగు చేసిన పంటలను కూడా ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు యాప్ విడుదల చేశామని స్పష్టం చేశారు. కర్నూలు నుంచి వీసీలో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్‌ఖాద్రీ, గిరీష్, అగ్రానమీ ఏడీ బాలవర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. కోరిన కోర్కెలు తీర్చేస్వామిగా విరాజిల్లే తర్తూరు రంగనాథుడికి దాదాపు 132 ఏళ్ల క్రితం దాతలు చెక్కతో 25 అడుగుల ఎత్తైన రథాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇదే రథంపై స్వామిని ఊరేగిస్తున్నారు. జిల్లాలో తర్తూరు జాతరకు ఎంతో విశిష్టత ఉంది.
తొమ్మిది మంది డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం చూచిరాతలకు పాల్పడిన తొమ్మిది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2,297 మంది విద్యార్థులకుగాను 2,125 మంది, మధ్యాహ్నం పరీక్షలకు 3,519 మంది విద్యార్థులకుగాను 3,157 మంది విద్యార్థులు హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
కృష్ణమ్మకు బోనాల సమర్పణ
శ్రీశైలం: ఈనెల 11వ తేదీన అమ్మవారి కుం
భోత్సవం సందర్భంగా స్థానిక మత్స్యకార మహిళలు మంగళవారం కృష్ణమ్మకు బోనాలు సమర్పి ంచారు. పాతాళగంగ మెట్ల మార్గంలో బోనాలతో వెళ్లి కృష్ణవేణి నదికి పూజలు చేసి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీర జాకెట్లతో కూడిన సారె సమర్పించారు. ఏటా అమ్మవారి కుంభోత్పవం రోజు కాని, ఆ తర్వాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో కృష్ణమ్మకు సారెను సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది.
![బోనాలతో వెళ్తున్న మత్స్యకార మహిళలు1](https://www.sakshi.com/gallery_images/2023/04/5/04sri02-200080_mr.jpg)
బోనాలతో వెళ్తున్న మత్స్యకార మహిళలు
Comments
Please login to add a commentAdd a comment