కిలో టమాట రూ.90 | - | Sakshi
Sakshi News home page

కిలో టమాట రూ.90

Published Fri, Oct 4 2024 2:12 AM | Last Updated on Fri, Oct 4 2024 2:12 AM

కిలో టమాట రూ.90

మార్కెట్‌కు తగ్గిన టమాట సరఫరా

కర్నూలు(అగ్రికల్చర్‌): మార్కెట్‌లోకి టమాట సరఫరా గణనీయంగా తగ్గింది. జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌కు క్రమంగా టమాట తాకిడి తగ్గుతోంది. సెప్టెంబర్‌ 30న పత్తికొండ మార్కెట్‌కు 75 టన్నులకు పైగా టమాట వచ్చింది. ఈ నెల 1 నుంచి టమాట రావడం తగ్గుతోంది. గురువారం 56.33 టన్నుల టమాట వచ్చింది. తాజాగా రైతుబజారులో కిలో టమాట ధర రూ.55/65 పెట్టారు. బయట కిలో ఽటమాట రూ.80 నుంచి రూ.90 వరకు అమ్మకాలు చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో రబీ పంట కింద ఇటీవలనే టమాట సాగు చేశారు. ఈ దిగుబడులు మార్కెట్‌లోకి వచ్చే వరకు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డీపీఓగా భాస్కర్‌ బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): జిల్లా పంచాయతీ అధికారిగా భాస్కర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా కర్నూలు డ్వామాలో డీవీఓగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం డీపీఓగా బదిలీ చేసింది. ఇక్కడ డీపీఓగా విధులు నిర్వహించిన టీ నాగరాజునాయుడు అనంతపురం డీపీఓగా బదిలీ అయ్యారు. డీపీఓగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్‌ను కర్నూలు డీఎల్‌పీఓ తిమ్మక్క, కార్యాలయ ఏఓలు శ్రీనివాసరెడ్డి, ప్రతిమ, సిబ్బంది బొకేలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. అందరి సహకారంతో స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి సారిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement