ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
● కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారి భద్రతక మిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగే 28 బ్లాక్‌స్పాట్లను గుర్తించారని, ఆయా ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించేందుకు వీలవుతుందో జాతీయ రహదారులు, పోలీసుల, కర్నూలు మునిసిపల్ కమిషనర్ సంయుక్తంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు వీలుగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యాశాల, బస్టాండ్‌లోపల ఆటోస్టాండ్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న పెద్ద సర్కిళ్లను తగ్గించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కర్నూలు బస్టాండ్ నుంచి డోన్, అనంతపురం, బెంగళూరు వెళ్లే బస్సులను రాజ్ విహార్ బస్టాండ్ నుంచి ఆపరేట్ చేసే అంశంపై ట్రయల్ రన్ చేయాలని ఆర్‌ఎంకు సూచించారు. కర్నూలు నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు రెండు బస్సులను నడపాలన్నారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ నగరంలో పనిచేయని సీసీ కెమెరాల స్థానంలో హైరెజుల్యూషన్ ఉన్న 8 మెగా పిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో ఒకటే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుంటే అక్కడ రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు సిటీ బస్సులు లేనందున ద్విచక్రవాహనాల్లో వెళ్తుండడంతో ట్రాఫిక్ అధికమవుతోందని, సిటీ బస్సులను నడిపితే బాగుంటుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించాలని ఆర్‌ఎంను ఆదేశించారు. త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని ఆర్‌ఎం వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క లెక్టర్ చల్లా కల్యాణి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment