25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె
కర్నూలు(సెంట్రల్): తమ సమస్యలు పరిష్కా రం కోసం ఈనెల 28 నుంచి సమ్మెలోకి వెళ్తున్న ట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.కిరణ్‌కుమార్, కేవీవీ నరసింహరావు తెలిపారు. శుక్ర వారం జాయింట్ కలెక్టర్‌ను ఆమె కార్యాలయంలో కలసి సమ్మె నోటీసును అందజేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెకు వెళ్తున్నామని వారు జేసీకి వివరించారు.
పత్తిలో తేమ శాతం
12కు మించరాదు
కర్నూలు(అగ్రికల్చర్): విక్రయానికి తెచ్చేపత్తి దిగుబడుల్లో తేమ శాతం 12కు మించకుండా ఆరబెట్టుకుని రావాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి రైతులకు సూచించారు. శుక్రవారం ఆమె జిన్నింగ్ మిల్లులను పరిశీలించి దిగుబడులను తెచ్చిన రైతులతో మాట్లాడారు. పత్తికి పూర్తి మద్దతు ధర లభించాలంటే ఇంటి వద్ద ఆరబెట్టుకొని తగిన నాణ్యతా ప్రమాణాలతో తీసుకెల్లాలని సూచించారు. తేమ 8 శాతం వరకు ఉంటేనే పూర్తి మద్దతు ధర అంటే రూ.7521 లభిస్తుందని, 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే ఒక్కో శాతానికి మద్దతు ధరలో ఒక్క శాతం ధర కోత విధించనున్నట్లు తెలిపారు. గరిష్టంగా 12 శాతం మాత్రమే తేమ ఉండాలని, అంతకు మించి తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయదన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడుల్లోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తారని, ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అప్పు వ్యవహారంలో ఉద్రిక్తత
కోవెలకుంట్ల: అప్పు వ్యవహారం కోవెలకుంట్లలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. నంద్యాల మాజీ ఎంపీ దివంగత ఎస్పీవై రెడ్డి కుమా ర్తె సుజల పైపుల ఫ్యాక్టరీకి సంబంధించి వ్యాపార పనుల నిమిత్తం కోవెలకుంట్లకు వచ్చింది. ఆమె పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ అధినేత సూర్యనారాయణరెడ్డికి రూ.10 కోట్ల వర కు అప్పు చెల్లించాల్సి ఉంది. ఓ పైపుల దుకాణం వద్ద ఉందని విషయం తెలుసుకున్న అతని కుమా రుడు సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తీసుకు న్న అప్పు చెల్లించాలని అడిగే సమయంలోనే ఇన్నోవా వాహనంలో ఎక్కి బయలుదేరేందుకు ప్రయత్నించారు. సుధీర్‌రెడ్డి వాహనం ఆపి మా ట్లాడాలని బైక్‌తో ఇన్నోవాను అనుసరించాడు. ఈక్రమంలో గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో కింద పడ్డా డు. అయినప్పటికీ వాహనం వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వా హనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.సుధీర్‌రెడ్డి, ఎస్పీ వై రెడ్డి కుమార్తెకు వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రి క్త పరిస్థితులు నెలకొనడంతో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment